ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులు, రిటైర్మెంట్ ప్లానింగ్, భవిష్యత్ ఆర్థిక భద్రతపై అవగాహన కల్పించేందుకు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) మిస్సోరి చాప్టర్ ఆధ్వర్యంలో ఉచిత ఫైనాన్షియల్ లిటరసీ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
ఆగస్టు 29, 2026న అమెరికా సెంట్రల్ టైమ్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ వర్క్‌షాప్ జరగనుంది. MBA Finance, Licensed Financial Professional ప్రసాద్ స్వర్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
వర్క్‌షాప్‌లో పెట్టుబడి వ్యూహాలు, మార్ట్గేజ్ ప్రొటెక్షన్ ప్లాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ & లివింగ్ బెనిఫిట్స్, లాంగ్ టర్మ్ కేర్, కాలేజ్ ప్లానింగ్, విల్స్ & ట్రస్ట్స్, 401(k) రోలోవర్ ఆప్షన్స్, Roth IRA, Traditional IRA తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
“Knowledge Today, Security Tomorrow” అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితం. ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులు, రిటైర్మెంట్ ప్లానింగ్‌పై అవగాహన పెంచుకోవాలనుకునే వారికి ఈ వర్క్‌షాప్ ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. NATS వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
BOD & EC సభ్యులు
రమేష్ బెల్లం – BOD
శ్రీనివాస్ మంచికాపులాడి – Past President & Current Advisory BOD
డా. సుధీర్ అత్లూరి – Advisory BOD
సందీప్ కొల్లిపర – Zonal Vice President, North Zone
NATS మిస్సోరి చాప్టర్ టీమ్
అన్వేష్ చాపరాల, తరుణ్ దివి, చైతన్య పుచ్చకాయల, రాకేష్ రెడ్డి మారుపాటి, నవీన్ కొమ్మినేని, హరి గోగినేని, శ్రీకాంత్ హడవెట్టి, మధుసూదన్ దడ్డాల, యుగేందర్ చిలమకూరి, మురళి బండారుపల్లి, నరేష్ రాయంకుల, సునీల్ C. స్వర్ణ, నాగ శ్రీనివాస శాస్త్రి, దేవి ప్రసాద్, చైతన్య అప్పాని తదితరులు కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారు.











