చార్లెట్‌లో వాలీబాల్ అభిమానులకు పండుగ రానుంది. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ – చార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో GTA Charlotte Volleyball Tournament 2026 నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 26, 2026న Chestnut Square Park, 320 Chestnut Pkwy, Indian Trail, NC 28079 వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది.
సర్వ్.. స్పైక్.. పోటీ.. గెలుపు! అంటూ ఆటగాళ్లలో ఉత్సాహం నింపేలా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. కమ్యూనిటీ టీమ్స్, కార్పొరేట్ టీమ్స్, స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి టీమ్‌గా పాల్గొనే అవకాశం ఉంది.
పోటీలతో పాటు ఫుడ్, మ్యూజిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండనున్నాయి. విజేతలకు గ్రాండ్ ప్రైజులు, ట్రోఫీలు అందించనున్నారు.
రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. టోర్నమెంట్‌లో పాల్గొనాలనుకునే వారు తమ టీమ్‌ను సిద్ధం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.











