తెలుగు సినీ సంగీత అభిమానులకు అమెరికాలో మరో భారీ వినోద వేడుక సిద్ధమవుతోంది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రామ్ మిరియాల జూన్ 6న టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్‌లో నిర్వహించే “లవ్ యునైటెడ్ డల్లాస్” కార్యక్రమంలో ప్రత్యక్ష సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సంగీత వేడుక ఫ్రిస్కో ఫ్లయర్స్ క్లబ్ (6300 Flyers Way, Frisco, TX 75034)లో జరగనుంది. యూఈ అల్ట్రా ఎంటర్‌టైన్‌మెంట్స్, లిట్‌స్టేజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ , వినెస్సా ఈవెంట్స్, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా అనన్య, హిమజ హాజరుకానుండగా, వ్యాఖ్యాతలుగా మౌనిక, నాగ దీప్తి వ్యవహరించనున్నారు. ప్రవాస తెలుగు కుటుంబాలు, యువతను ఆకట్టుకునేలా సంగీతం, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్‌కు సంబంధించిన టేబుల్ బుకింగ్స్, స్పాన్సర్‌షిప్ వివరాల కోసం నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు. తెలుగు సంగీతాభిమానులకు ఈ కార్యక్రమం ఓ ప్రత్యేక అనుభూతిని అందించనుందని నిర్వాహకులు తెలిపారు.
















