న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఉన్న సాయి దత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్ – శ్రీ శివ విష్ణు టెంపుల్లో 12వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. జూన్ 27 నుంచి జూలై 5, 2026 వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు భక్తి, ఆధ్యాత్మికత, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, మహా హోమాలు, కలశ పూజలు, అర్చనలు, వేదపారాయణాలు, అన్నదానంతో పాటు పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అమెరికాలోని తెలుగు, భారతీయ భక్తులకు ఇది ఒక అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఎడిసన్‌లోని 1665 ఓక్ ట్రీ రోడ్లో ఉన్న సాయి దత్త పీఠంలో జరిగే ఈ మహోత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని దైవానుగ్రహం పొందాలని, అలాగే వివిధ సేవలు, స్పాన్సర్‌షిప్‌లలో భాగస్వాములు కావాలని ఆలయ ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి భక్తులకు హృదయపూర్వక పిలుపునిచ్చారు.