ఒక రక్తదానం.. ఎంతోమంది ప్రాణాలకు ఆశాకిరణంగా నిలుస్తుందనే సందేశంతో సేవా ఇంటర్నేషనల్ USA – డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ బ్లడ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వెర్సిటీ బ్లడ్ సెంటర్ ఆఫ్ మిచిగాన్ భాగస్వామ్యంతో ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఆగస్టు 29, శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ బ్లడ్ డ్రైవ్ కొనసాగనుంది. కాంటన్‌లోని ది హిందూ టెంపుల్, క్లాస్‌రూమ్ 1 & 2 వేదికగా కార్యక్రమం నిర్వహించనున్నారు.
రక్తదానం చేయాలనుకునే వారు ముందుగానే అపాయింట్‌మెంట్ రిజర్వ్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. రక్తదానం చేసే ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత నీరు తాగాలని, ఫోటో ఐడీ వెంట తీసుకురావాలని కోరారు.
“గివ్ బ్లడ్.. సేవ్ లైవ్స్” అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని సేవా డెట్రాయిట్ చాప్టర్ పిలుపునిచ్చింది.














