స్వీడన్‌లోని తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. Sweden Telugu Community (STC), YCSA సంయుక్తంగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నాయి.
స్వీడన్‌లోని జార్ఫల్లా కల్తుర్స్సెన్ వేదికగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, దీప ప్రజ్వలన, సంగీతం, నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను చాటేలా కార్యక్రమాలను రూపొందించారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని దేశభక్తి స్ఫూర్తిని చాటాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

జార్ఫల్లా కల్తుర్స్సెన్









