ఫ్లోరిడాలోని తెలుగు తెలంగాణ ప్రజలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా నిలిచే "టాంపా బోనాలు 2026"కు రంగం సిద్ధమైంది. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (TGF) ఆధ్వర్యంలో ఈ సంప్రదాయ వేడుకలను జూలై 26, 2026న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
టాంపాలోని ICC Hall (5511 Lynn Road, Tampa, Florida)లో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావం ప్రతిఫలించేలా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
బోనం సమర్పణ, అమ్మవారి పూజలు, సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, కుటుంబ సమేతంగా పాల్గొనే కార్యక్రమాలతో ఈ వేడుకలు కనువిందు చేయనున్నాయి. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ వాసులు తమ మూలాలను గుర్తు చేసుకుంటూ, కొత్త తరానికి తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే వేదికగా ఈ ఉత్సవం నిలవనుంది.
ఈ కార్యక్రమానికి ప్రవేశం పూర్తిగా ఉచితం. అయితే, హాజరయ్యే వారు తప్పనిసరిగా ముందస్తు నమోదు (Registration) చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు లేదా RSVP కోసం contact@tgfl.org ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.













