అమెరికాలోని తెలుగు కుటుంబాల పిల్లలకు భారతీయ సంస్కృతి, విలువలు, ధర్మం గురించి పరిచయం చేసేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో ‘విశ్వ గురుకులం 2026’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రామాయణం ఆధారంగా పిల్లలకు జీవితానికి అవసరమైన నైతిక విలువలు, కుటుంబ బంధాలు, క్రమశిక్షణ, గౌరవం, ధర్మం వంటి అంశాలను బోధించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.

అన్ని వయసుల పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించనున్నారు. బుధ, గురు, శని, ఆదివారాల్లో బ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. పిల్లలకు కథల రూపంలో రామాయణంలోని విలువలను పరిచయం చేస్తూ భారతీయ సంస్కృతిపై అవగాహన పెంచేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆసక్తి ఉన్నవారు TANA Viswa Gurukulam 2026 Registration ద్వారా నమోదు చేసుకోవచ్చు.

“రామాయణం మన సంస్కృతికి మూలస్తంభం.. భావితరాలకు అందిద్దాం” అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

tana.jpg