తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోని తెలుగు ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో టీటీఏ ప్రతి ఏడాది అమెరికావ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది.

ఈ ఏడాది TTA New Jersey Bathukamma Samaralu 2026ను అక్టోబర్ 11, 2026న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు నిర్వహించనున్నారు. న్యూజెర్సీలోని ఫోర్డ్స్‌లో ఉన్న గ్రాండ్ బాంక్వెట్ హాల్ ఈ వేడుకలకు వేదిక కానుంది.

టీటీఏ వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి ఆశీస్సులతో, అడ్వైజరీ చైర్ డా. విజయపాల్ రెడ్డి, అడ్వైజరీ కో-చైర్ డా. మోహన్ రెడ్డి పాటలోళ్ల, అడ్వైజరీ సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, శ్రీని అనుగు, అధ్యక్షుడు నవీన్ మలిపెద్ది, మాజీ అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల, జనరల్ సెక్రటరీ శివ రెడ్డి కొల్లా మార్గదర్శనంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు.

న్యూజెర్సీ కార్యక్రమాన్ని శివ రెడ్డి కొల్లా, నర్సింహ పెరుక, సుధాకర్ ఉప్పల, అరుణ్ అర్కాల, నరేందర్ యారవ, దీపా జలగం తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీఏ న్యూజెర్సీ ఆర్‌వీపీలు ప్రశాంత్ నలుబందు, రాజా నీలం, సాయిరాం గజలతో పాటు న్యూజెర్సీ కోర్ టీమ్, వాలంటీర్లు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

ఈ బతుకమ్మ సంబరాల్లో లైవ్ పెర్ఫార్మెన్స్‌లు, బెస్ట్ బతుకమ్మ పోటీలు, బెస్ట్ కాస్ట్యూమ్ పోటీలు, వెండర్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మహిళలు, పురుషులు, చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటనున్నారు.

tta nj batukamma.png