అమెరికాలోని అమెజాన్ ఫుల్‌టైమ్ ఆపరేషన్స్ ఉద్యోగులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత ఉన్న ఉద్యోగుల కనీస గంట వేతనాన్ని మరో $1 పెంచి.. గంటకు $20కి తీసుకెళ్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

ఈ పెంపుతో 40 గంటలు పనిచేసే ఫుల్‌టైమ్ ఉద్యోగికి.. ఓవర్‌టైమ్, బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు మినహాయించి.. ఏడాదికి సుమారు $41,600 బేస్ వేతనం లభించనుంది.

అంతేకాదు.. ఉద్యోగి ప్రయోజనాలను కూడా కలిపి చూస్తే సగటు మొత్తం పరిహారం గంటకు $32 దాటుతుందని అమెజాన్ తెలిపింది.

ఇక ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం “Day 1 Financial” పేరుతో కొత్త ఆర్థిక ప్రయోజనాన్ని కూడా తీసుకొచ్చింది. అర్హత ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు First Tech Federal Credit Union ద్వారా తక్కువ ఖర్చుతో బ్యాంకింగ్ సేవలను జీవితాంతం అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇప్పటికే అమెజాన్ ఉద్యోగులకు హెల్త్‌కేర్, ఉచిత Prime మెంబర్‌షిప్, విద్యా ప్రయోజనాలు వంటి సౌకర్యాలు అందిస్తోంది. తాజా వేతన పెంపుతో అమెరికాలో గంటల వారీ ఉద్యోగుల కోసం అమెజాన్ అందిస్తున్న మొత్తం కాంపెన్సేషన్ ప్యాకేజీ మరింత పెరిగింది.