అమెరికాలో గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
లోకేశ్ దంపతులు తమ కుటుంబ వివాహ వేడుకకు ప్రత్యేకంగా హాజరుకావడంతో డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. బిజీ షెడ్యూల్‌లోనూ సమయం కేటాయించి, ప్రత్యేకంగా అమెరికాకు వచ్చి వివాహ వేడుకలో పాల్గొన్నందుకు నారా లోకేశ్‌కు డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వివాహ వేడుకలో లోకేశ్ దంపతుల పాల్గొనడం కుటుంబ సభ్యులు, బంధువుల్లో ప్రత్యేక ఆనందాన్ని నింపింది. నూతన దంపతులకు వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంతోషకరమైన వైవాహిక జీవితం సాగించాలని ఆకాంక్షించారు.









