AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెరుగుతున్న భారీ నిధుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని.. Nvidia మద్దతు ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ CoreWeave కీలక నిర్ణయం తీసుకుంది. కన్వర్టిబుల్ డెట్ ఆఫరింగ్ ద్వారా $3 బిలియన్లను సమీకరించనున్నట్లు గురువారం ప్రకటించింది. అదనంగా ప్రారంభ కొనుగోలుదారులు మరో $500 మిలియన్ల విలువైన రుణాన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.
సేకరించిన నిధుల్లో కొంత భాగాన్ని షేర్ డైల్యూషన్ ప్రభావాన్ని తగ్గించేందుకు, మిగిలిన మొత్తాన్ని సంస్థ కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు CoreWeave తెలిపింది.
అంతేకాదు.. కంపెనీ 35 మిలియన్ క్లాస్-A షేర్లను విక్రయించే అట్-ది-మార్కెట్ ఆఫరింగ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. బుధవారం షేర్ ముగింపు ధర ఆధారంగా చూస్తే.. ఈ కార్యక్రమం ద్వారా సుమారు $2.92 బిలియన్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. అయితే మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పుడు, ఎంత మొత్తంలో షేర్లను విక్రయించాలన్నది కంపెనీ నిర్ణయించనుంది.
ఇక మూడో త్రైమాసికంలో స్వల్పకాలిక కంప్యూట్ కెపాసిటీ ఒప్పందాలను ఏటా ఒక్క మెగావాట్‌కు సుమారు $40 మిలియన్ల రేటుతో కుదుర్చుకున్నట్లు CoreWeave వెల్లడించింది. దీంతో జూన్ చివర్లో ఉన్న 3.7 గిగావాట్ల నుంచి కాంట్రాక్ట్ చేసిన పవర్ కెపాసిటీ 4.2 గిగావాట్లకు పెరిగింది.
ఆగస్టులో ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో CoreWeave $104.2 బిలియన్ల రెవెన్యూ బ్యాక్‌లాగ్ నమోదు చేసింది. ఆ తర్వాత మూడో త్రైమాసికం ప్రారంభంలోనే మరో $25 బిలియన్లకు పైగా కస్టమర్ కమిట్‌మెంట్లు కుదిరినట్లు వెల్లడించింది.
ఈ ఏడాది ప్రారంభంలో Meta.. CoreWeave నుంచి AI క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం $21 బిలియన్లు ఖర్చు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి అదనంగా 2031 డిసెంబర్ 14 వరకు సుమారు $14.2 బిలియన్ల చెల్లింపులకు సంబంధించిన కమిట్‌మెంట్ కూడా ఉంది. 2032 వరకు అదనపు క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పొందేందుకు ఒప్పందాన్ని విస్తరించే అవకాశం కూడా Metaకు ఉంది.













