తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే సంచలనం సృష్టిస్తూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కి నెట్టి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లింది.

మార్పును కోరుకున్న తమిళ ఓటర్లు.. కొత్త పార్టీ అయిన టీవీకేకు పట్టం కట్టారు. విజయ్‌ ప్రచారానికి ఆటంకాలు, సినిమా రిలీజ్‌కి ఇబ్బందులు కలిగాయి. ఈ సవాళ్లను అధిగమించి విజయ్‌ TVK పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటములను వెనక్కి నెట్టి ఆధిక్యంలో నిలిచింది. కొత్త పార్టీకి అవకాశం కల్పిస్తూ.. మార్పును కోరుకున్న తమిళ ఓటర్లు తీర్పు ఇవ్వడం ఈ ఫలితాలతో స్పష్టంగా కనిపిస్తోంది.