ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకున్న వేళ క్రికెట్ ప్రపంచంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మే 30, 31 తేదీల్లో అహ్మదాబాద్‌లో జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశాలకు పీసీబీ ఛైర్మన్, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీకి కూడా ఆహ్వానం అందింది. అంతేకాదు, నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఫైనల్‌ను వీక్షించేందుకు కూడా ఆయనకు ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. అయితే భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఆయన పర్యటనపై అనేక చర్చలు సాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, గత ఏడాది ఆసియా కప్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫైనల్ అనంతరం ట్రోఫీ, మెడల్స్‌ను నఖ్వీ తీసుకెళ్లి దుబాయ్‌లో లాకర్‌లో ఉంచినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. “భారత్‌కు వస్తే ఆసియా కప్ ట్రోఫీ కూడా వెంట తీసుకురండి” అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నఖ్వీ భారత్ పర్యటనపై తుది నిర్ణయం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల్లోనే ఉంది.












