ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుని పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
వరుస ఓటములతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంజాబ్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం పాలైన పంజాబ్ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న పరిస్థితిలో ఢిల్లీతో పోరు సవాల్‌గా మారింది. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్.. ఆ తర్వాత పరాజయాల బాట పట్టి హ్యాట్రిక్ ఓటములతో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరుకునే అవకాశం ఉంది. అలాగే ప్లేఆఫ్ అవకాశాలు కూడా మరింత బలపడనున్నాయి.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కూ ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఢిల్లీ.. పంజాబ్‌పై గెలిచి తిరిగి విజయాల బాట పట్టాలని భావిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది.















