పంజాబ్ కింగ్స్ (PBKS) స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి సోషల్ మీడియాలో చర్చకు కేంద్రంగా మారాడు. ప్రియాంశ్ ఆర్యతో సంబంధించిన ఒక వీడియో వైరల్ కావడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.
ఆ వీడియోను స్నాప్‌చాట్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు సహచర ఆటగాడు హర్‌ప్రీత్ బ్రార్ కూడా కనిపిస్తున్నారు. టీమ్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ వీడియో తీసినట్లు సమాచారం.
వీడియోలో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య తన ఫోన్‌లో చూస్తుండగా, అర్ష్‌దీప్ అతన్ని సరదాగా ఆటపట్టించినట్లు కనిపిస్తోంది. “వాట్ ఎ క్యూటీ మ్యాన్! నీ స్మైల్ చూపించు, నీ పళ్లు చూపించు” అంటూ అర్ష్‌దీప్ వ్యాఖ్యానించగా, హర్‌ప్రీత్ బ్రార్ కూడా నవ్వుతూ కనిపించాడు.
ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు దీనిని స్నేహపూర్వక సరదాగా భావించగా, మరికొందరు మాత్రం ప్రియాంశ్ అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించాడని విమర్శిస్తున్నారు.









