అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న కీలక ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ నును బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సీఎస్కే తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు కీలక మార్పులు చేసింది. అకేలా హోసెన్, ప్రశాంత్ వీర్ స్థానాల్లో మాథ్యూ షార్ట్, గుర్‌జపనీత్ సింగ్‌లకు అవకాశం కల్పించింది.

ఈ మ్యాచ్ ఇరు జట్లకూ అత్యంత కీలకం. ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే సీఎస్కే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు క్వాలిఫైయర్-1లో స్థానం ఖరారు చేసుకోవాలంటే గుజరాత్ టైటాన్స్ విజయం సాధించాల్సిందే. లీగ్ దశలో ఇరు జట్లకీ ఇదే చివరి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.