ఐపీఎల్ 2026లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక పోరులో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 64 పరుగులతో చెలరేగగా, సాయి సుదర్శన్ 84 పరుగులతో మరోసారి అదరగొట్టాడు. జోస్ బట్లర్ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో మ్యాచ్ పూర్తిగా గుజరాత్ ఆధీనంలోకి వెళ్లింది.
ఇక 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి మ్యాచ్ ప్రారంభంలోనే షాక్ తగిలింది. వికెట్ కీపర్ సంజూ శాంసన్ తొలి ఓవర్‌లోనే వేలికి గాయమై మైదానం వీడగా, ఉర్విల్ పటేల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్ ఆశలు ప్రమాదంలో ఉన్న చెన్నైకి భారీ టార్గెట్‌తో పాటు కీలక ప్లేయర్ గాయం మరింత ఒత్తిడిని తెచ్చింది.












