చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు, ముఖ్యంగా ధోనీ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2026లో చెపాక్ స్టేడియంలో సీఎస్కే ఆడుతున్న చివరి మ్యాచ్ కావడంతో ధోనీ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడని అభిమానులు ఆశించారు. అయితే జట్టు పరిస్థితుల కారణంగా ధోనీ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నప్పటికీ తుది జట్టులో లేడని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు. దీంతో చెపాక్‌లో ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య కీలక పోరు చెపాక్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే సీఎస్కేకు ఈ మ్యాచ్ తప్పనిసరి కాగా, సన్‌రైజర్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం కానుంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన 23 మ్యాచ్‌లలో సీఎస్కే 15 విజయాలు సాధించగా, హైదరాబాద్ ఎనిమిది మ్యాచ్‌లలో గెలిచింది.