ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నోలోని ఏకనా స్టేడియంలో జరుగుతున్న 59వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆరంభంలోనే టాప్ ఆర్డర్ విఫలమవడంతో చెన్నై ఒత్తిడిలో పడింది. సంజు శామ్సన్ 20 పరుగులు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 13 పరుగులకే వెనుదిరిగారు. ఆకాష్ మహారాజ్ సింగ్ అద్భుత బౌలింగ్‌తో కీలక వికెట్లు తీసి లక్నోకు మంచి ఆరంభాన్ని అందించాడు.
అయితే జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కార్తీక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 71 పరుగులు చేసి చెన్నై స్కోరును గౌరవప్రద స్థితికి తీసుకెళ్లాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. డెవాల్డ్ బ్రెవిస్ 25 పరుగులతో మంచి సహకారం అందించాడు. చివర్లో శివమ్ దుబే 16 బంతుల్లో 32 పరుగులతో వేగంగా ఆడి స్కోరును 187కు చేర్చాడు.
లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్ 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి మెరిశాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించాలంటే 188 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది.















