ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ - కోల్‌కత నైట్ రైడర్స్ మ్యాచ్ సందర్భంగా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రవి శాస్త్రి చేసిన చిన్న పొరపాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టాస్ సమయంలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తో మాట్లాడిన శాస్త్రి, “మీ జట్టుకు ఇప్పటికే ‘Q’ గుర్తు వచ్చేసింది” అంటూ ప్లేఆఫ్స్ అర్హత ఖరారైనట్టు వ్యాఖ్యానించారు.
కానీ వాస్తవానికి గుజరాత్ టైటాన్స్ ఇంకా గణితపరంగా ప్లేఆఫ్స్ చేరలేదు. అయితే పాయింట్ల పట్టికలో బలమైన స్థితిలో ఉంది. దీంతో శాస్త్రి వ్యాఖ్యలపై అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.
ఇదే ఏడాది టి20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో కూడా శాస్త్రి చేసిన మరో కామెంటరీ పొరపాటు అప్పట్లో చర్చనీయాంశమైంది.












