1999 మే 23 ప్రపంచకప్‌లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆడిన 140 పరుగుల ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటిగా నిలిచింది. తన తండ్రి మరణించిన కొద్ది రోజులకే తిరిగి జట్టులో చేరిన సచిన్, బ్రిస్టల్ వేదికగా అద్భుత సెంచరీతో అందరి హృదయాలను కదిలించాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిన్, రాహుల్ ద్రావిడ్ తో కలిసి మూడో వికెట్‌కు 237 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 101 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
సెంచరీ పూర్తయ్యాక ఆకాశం వైపు చూస్తూ తన ఇన్నింగ్స్‌ను తండ్రికి అంకితం చేసిన సచిన్ దృశ్యం కోట్లాది అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. భారత్ ప్రపంచకప్ గెలవకపోయినా, ఈ ఇన్నింగ్స్ మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.












