ఉప్పల్ స్టేడియంలో జరగనున్న Sunrisers Hyderabad - Royal Challengers Bengaluru మ్యాచ్ టికెట్ ధరలు భారీగా పెరగడం అభిమానుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. సాధారణంగా రూ.950గా ఉన్న కనీస టికెట్ ధరను ఈ మ్యాచ్‌కు రూ.1950గా నిర్ణయించారు.
విరాట్ కోహ్లి ఆడనున్న మ్యాచ్ కావడంతో అభిమానుల ఆసక్తిని క్యాష్ చేసుకుంటోందని విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్ బాక్స్ టికెట్ ధర రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు పెరిగింది. ఈస్ట్, వెస్ట్ స్టాండ్స్ టికెట్లు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి. టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే అమ్ముడుపోగా, సుమారు 3 లక్షల మంది అభిమానులు వెయిటింగ్‌లో ఉన్నారు. ఐపీఎల్ టికెట్ ధరల నియంత్రణపై బీసీసీఐ మార్గదర్శకాలు తీసుకురావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
















