ఐపీఎల్ 2026లో ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 55 పరుగుల తేడాతో ఓడించింది. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది.
విరాట్ కోహ్లీ కేవలం 15 పరుగులకే అవుట్ కాగా, వెంకటేశ్ 44, దేవదత్ పడిక్కల్ 21 పరుగులతో పోరాడారు. అనంతరం రజత్ పాటీదార్ అర్ధశతకం, కృనాల్ పాండ్య వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడినా విజయం మాత్రం దూరమైంది.
హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరును అదుపులో పెట్టారు. అయితే ఈ భారీ విజయం సాధించినప్పటికీ, ఆర్సీబీని 160 పరుగుల లోపే కట్టడి చేయలేకపోవడంతో ఎస్ఆర్‌హెచ్ టాప్-2 అవకాశాన్ని కోల్పోయి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.












