జర్మనీకి చెందిన ఫ్యూజన్ పవర్ స్టార్టప్ Focused Energy భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. తాజాగా కంపెనీ 240 మిలియన్ డాలర్ల Series A ఫండింగ్ సమీకరించింది. దీంతో సంస్థకు మొత్తం ప్రైవేట్ పెట్టుబడులు 300 మిలియన్ డాలర్లకు చేరగా, అదనంగా 200 మిలియన్ డాలర్ల గ్రాంట్లు కూడా లభించాయి.
ఈ సంస్థ ఇనర్షియల్ కన్ఫైన్‌మెంట్ ఫ్యూజన్ టెక్నాలజీపై పనిచేస్తోంది. లేజర్లతో ఫ్యూజన్ ఇంధనాన్ని అత్యంత ఒత్తిడికి గురిచేసి అపార శక్తిని ఉత్పత్తి చేయడమే దీని లక్ష్యం. అమెరికాలోని Lawrence Livermore National Laboratoryలో ఉన్న National Ignition Facility ప్రయోగాన్ని ఆదర్శంగా తీసుకుని రియాక్టర్‌ను అభివృద్ధి చేస్తోంది.
జర్మనీలో మూసివేసిన అణు విద్యుత్ కేంద్రం ప్రాంతంలో “లైట్‌హౌస్” పేరుతో తొలి డెమో ప్లాంట్‌ను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. ప్రధాన పెట్టుబడిదారుగా RWE ఉంది.












