మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Threads మరో కీలక మైలురాయిని చేరుకుంది. నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 50 కోట్లకు (500 మిలియన్లు) చేరినట్లు సంస్థ ప్రకటించింది.
ఈ సందర్భంగా Threads 'Your Algo' అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ ఫీడ్‌లో ఏ అంశాలకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా లేదా తక్కువగా కనిపించాలనుకుంటున్నారో స్వయంగా నిర్ణయించుకోవచ్చు. ఈ సెట్టింగ్స్‌ను 1, 3 లేదా 7 రోజుల పాటు అమలు చేయవచ్చు.
అలాగే 'Communities' ఫీచర్‌ను మరింత విస్తరించిన మెటా, కొత్త Communities Hubను కూడా ప్రవేశపెట్టింది. దీనివల్ల క్రీడలు, వినోదం, పుస్తకాలు, టెక్నాలజీ వంటి అంశాలకు సంబంధించిన కమ్యూనిటీలను సులభంగా కనుగొనవచ్చు.
ఇక Live Chats ఫీచర్‌ను కూడా మరిన్ని కమ్యూనిటీలకు విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ అప్‌డేట్లతో Threads, X (ట్విట్టర్)కు గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.












