
నోకియా ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌ఎండీ తాజాగా భారత టెక్ మార్కెట్లో సరసమైన ధరకే 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ పరికరం హెచ్‌ఎండీ వైబ్ 2 5G పేరిట విడుదల అయింది. ఇది గత సంవత్సరం వచ్చిన హెచ్‌ఎండీ వైబ్ 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఇందులో 6.7-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. చాలారోజుల నుంచి తక్కువ ధరకే మంచి ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్ కొనాలని చూస్తుంటే, ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది.
హెచ్‌ఎండీ వైబ్ 2 5G ధర
భారతదేశంలో ఈ హ్యాండ్‌సెట్ రెండు స్టోరేజీ వేరియంట్లలో లాంచ్ అయింది. 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. కాగా, ఈ పరికరం నార్డిక్ బ్లూ, కాస్మిక్ లావెండర్, పీచ్ పింక్ రంగులలో లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్లతో పోటీ?
పోటీ పరంగా, ఈ తాజా ఫోన్ Ai+ నోవా 2 5G, శాంసంగ్ M06 5G, లావా షార్క్ 5G, పోకో C81 వంటి మోడళ్లతో పోటీపడుతుంది.
హెచ్‌ఎండీ వైబ్ 2 5G ధర
ఈ ఫోన్ 6.7-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. పరికరం 2.3GHz వరకు క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ యూనిసోక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ డ్యూయల్-సిమ్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. కెమెరా సెటప్ వస్తే, ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, LED ఫ్లాష్‌తో కూడిన AI-ఎనేబుల్డ్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.
బ్యాటరీ పరంగా, ఇది 6000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, ఈ ఫోన్‌లో Wi-Fi 5, బ్లూటూత్ 5.0, ఒక USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ కూడా ఉన్నాయి. అథెంటికేషన్ కోసం, దీనికి సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్ పరిమాణం 168×77.7×8.6మిమీ. బరువు 210గ్రా ఉంటుంది.











