
ఒప్పో భారత టెక్ మార్కెట్లో తన అత్యంత ప్రీమియం అయిన ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రాను లాంచ్ చేసింది. అంతేకాదు సంస్థ ఈ పరికరంతో మరో రెండు కొత్త 5G ఫోన్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ పరికరం ఫైండ్ ఎక్స్9 శ్రేణిలో అగ్రశ్రేణి మోడల్. ఈ పరికరంతో పాటు కంపెనీ ఫైండ్ ఎక్స్9ఎస్ ను కూడా విడుదల చేసింది. ఈ పరికరాలు ఇప్పుడు దేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒప్పో ఫైండ్ ఎక్స్9, ఫైండ్ ఎక్స్9 ప్రో మోడళ్ల శ్రేణిలో చేరాయి. ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకునే ముందు, ముందుగా దీని ధరను చూద్దాం.
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ధర, లభ్యత
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.169,999 నుండి ప్రారంభమవుతుంది. కాగా, ఈ పరికరం కాన్యన్ ఆరెంజ్, టండ్రా అంబర్ అనే రెండు రంగులలో లభిస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకుంటే రూ.11,000 వరకు విలువైన ఒక ఉచిత ప్రీమియం గిఫ్ట్ బాక్స్‌ను పొందవచ్చు. ఈ గిఫ్ట్ బాక్స్‌లో ఒప్పో ఎంకో ఎయిర్ 5 ప్రో TWS, ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా కోసం ఒక అధికారిక కవర్ కేస్ ఉంటాయి. కాగా, ఈ ఆఫర్ మే 27వ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటుందని గుర్తించుకోండి.
అంతేకాదు, ఈ కొత్త ఫోన్ కొంటె, కంపెనీ పాత ఫోన్‌లపై రూ.22,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. అలాగే, 24 నెలల వరకు జీరో-డౌన్ పేమెంట్ ఫైనాన్సింగ్‌ను కూడా పొందవచ్చు. SBI కార్డ్, HDFC బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్ బ్యాంక్ కార్డ్‌లతో పాటు UPI లావాదేవీల ద్వారా చేసే కొనుగోళ్లపై కంపెనీ 10% వరకు తక్షణ క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ఫీచర్లు
ఈ ఫోన్‌లో 6.82-అంగుళాల QHD+ ఆమోలేడీ స్క్రీన్ ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ గరిష్ట బ్రైట్‌నెస్ 1,800 నిట్స్ వరకు ఉంటుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ పొందుతుంది. ఈ ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, అడ్రినో 840 జీపీయూ, 16GB వరకు LPDDR5x ర్యామ్ శక్తిని అందిస్తాయి. ఈ పరికరం ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16 పై పనిచేస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం, ఈ ఫోన్‌లో హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో కూడిన 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 200-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-టెలిఫోటో కెమెరా కూడా ఉంది. ఈ కెమెరా 10x వరకు ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్‌ను అందిస్తుంది. ముందు వైపు, ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ పరికరం 30fps వద్ద 8K వీడియో రికార్డింగ్, 120fps వరకు 4K రికార్డింగ్, డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. బ్యాటరీ పరంగా, ఈ పరికరం 7050mah బ్యాటరీతో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్ లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది.













