
హైదరాబాద్: తెలంగాణలో నీట్ లో చాలా మందికి మంచి ర్యాంకులు వచ్చాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. పరీక్ష రాసిన ఒక్క విద్యార్థి కూడా నీట్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టడంతో ఎలాంటి వ్యతిరేకత లేదని, పేపర్ లీక్ పై చట్టం వచ్చిందని..నిందితులకు శిక్షతో పాటు రూ. కోటి జరిమానా విధించిందని తెలియజేశారు. 2014కు ముందు పేపర్ లీక్ అయితే 420 కింద కేసు పెట్టి వదిలిపెట్టేవారని రామచందర్ రావు పేర్కొన్నారు.











