
హైదరాబాద్ః 22ఏ జీవోపై రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 22ఏను రద్దు చేయాలని గుత్తా సుఖేందర్ అన్నారు. శనివారం మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. 22ఏ బిఆర్ఎస్ హయాంలోనూ ఉందన్నారు. ఉచితాలు కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు కొనసాగించాలని ఆయన సూచించారు.
తాను గతంలో బిపిఎల్, ఏపిఎల్పై సూచనలు చేశానని.. అయితే ఎవరూ పట్టించుకోలేదని గుత్తా చెప్పారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి బహిరంగంగా మాట్లాడకుంటే ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. యువకుడు, ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందరూ సహకరించాలని, ప్రతినిత్యం ఏదో రకమైన ఆటంకాలు ఎదురైతే చికాకు కలుగుతుంది కాబట్టి సిఎంను పని చేయనీయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.











