
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24న విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పేవర్ లీకేజీ దోషులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎన్‌ఎస్‌యుఐ, ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్ఐ, పిడిఎస్‌యు, ఎఐఎఫ్‌డిఎస్, ఎఐఎస్‌బి, ఎఐపిఎస్‌యు సంఘాలు డిమాండ్ చేశాయి.
ఢిల్లీలో యువతపై జరిగిన పోలీసుల లాఠీచార్జ్‌ను ఆయా సంఘాల నేతలు ఖండించారు. బంద్‌కు అన్ని విద్యాసంస్థలు సహకరించి విజయవంతం చేయాలని ఎన్‌ఎస్‌యుఐ తెలంగాణ అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి కోరారు. విద్యార్థుల కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపాలన్నారు.











