
మేషం
మేష రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగాలపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ వీరికి లభిస్తాయి. వ్యాపార పరంగా చేసేటువంటి నూతన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మాతృ వర్గ బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. ఎంత కష్టపడినా ఫలితం అంతంతమాత్రంగా ఉంటుంది. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశములు అందక నిరాశ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో గోపిక పాటించండి. అందరిని నమ్మి అని చెప్పవద్దు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. సౌర కంకణం చేతికి ధరించండి. ఈ రాశి వారికి కలసి వచ్చి సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభం
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి ధనం చేతికందుతుంది. వ్యాపార రంగంలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. ఫార్మా రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించండి వివాదాలకు దూరంగా ఉండండి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ప్రతిరోజు ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. నూతన వాహన యోగం ఉన్నది. జిల్లేడు హనుమాన్ ని ఇంట్లో కాని వ్యాపార ప్రదేశాలలో కానీ ఉంచి పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చేది ఇంకా తొమ్మిది కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధునం
మిధున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణముంటుంది. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ విషయంలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. భూవివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక,సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పునర్ వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిరోజు కూడా అరటి నార వత్తులతో దీపారాధన చేయండి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది. శక్తి కంకణం చేతికి ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహం
సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి అందులో ఎక్కువ మొత్తంలో శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఓర్పు సహనం కలిగి ఉంటారు. చేపట్టిన పనులలో అవాంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. విద్యార్థిని విద్యార్థులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభం అవుతుంది. ఆర్థిక భారం తేలికవుతుంది. ప్రతిరోజు మీ ఇష్ట దైవానికి ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం మరియు శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య
కన్యా రాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. విహారయాత్రలు చేస్తారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏజెంటు మోసాలకు దూరంగా ఉండండి. ఋణ పరమైన సమస్యలు నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారాలలో అంచనాలను దాటి లాభాలు అందుతాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవండి లేదా వినండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
తుల
తులా రాశి వారికి వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రుణాలు తీర్చే వేస్తారు. రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సినీ కళా రంగాలలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దీర్ఘాకాలిక ఋణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపం మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలొ కుటుంబ సభ్యులతో విశేషంగా పాల్గొంటారు. ఇందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశములు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవండి. మీ రాశి వారికి కలిసి వచ్చేసరికి 6 కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు
ధనుస్సు రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం లేదా బదిలీ కావడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. విద్యార్థిని విద్యార్థులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. బంధు మిత్రులతో చిన్న చిన్న విభేదాలు తప్పవు. రాజకీయరంగంలో ఉన్న వారికి నూతన పదవులను లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏదైనా నూతన పనిని ప్రారంభించే ముందు వినాయకుడికి పూజ చేసి ప్రారంభించండి నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మకరం
మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు స్థానా చరణం లభిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నూతన వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ సమస్యలు పరిష్కారమౌతాయి. ఏదైనా ఒక మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు డార్క్ బ్లూ. నేను పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా ఒక శనివారం శనికి తైలాభిషేకం చేయించండి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కీలక వ్యవహారాలలో సోదరుల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతానం ఉద్యోగం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఏదైనా ఒక శనివారం వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం
మీన రాశి వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి కలసి బాధ్యతను ఉంటుంది. ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన విషయాలలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పునర్ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. మొత్తం మీద ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక సోమవారం శివునికి అభిషేకం చేయించండి శివాలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.












