
మన తెలంగాణ/మోత్కూర్ : మోత్కూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని మోత్కూర్, అడ్డగూడూర్, గుండాల, ఆత్మకూర్(ఎం) మండలాలకు సంబంధించిన 31 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా, మొత్తం 551 దరఖాస్తులు అందినట్లు సీడీపీఓ నాజీ విలేకరులకు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి 7 వరకు మోత్కూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో నిర్వహించే సర్టిఫికెట్ల పరిశీలనకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన అన్ని సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకుని, వాటి ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా వెంట తీసుకురావాలని తెలిపారు. నిర్ణీత గడువులో అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని లేనిపక్షంలో కలిగే ఇబ్బందులకు అభ్యర్థులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీడీపీఓ నాజీ తెలిపారు.











