కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్! ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఈనెలలో తన వివో X300 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేయనుంది. అవి వివో X300 FE, వివో X300 FE. ఈ రెండు పరికరాలు మే 6న భారత టెక్ మార్కెట్లో లాంచ్ అవుతాయని కంపెనీ ఇటీవల ధృవీకరించింది. కాగా, ఈ రెండు పరికరాల సేల్స్ మే 14న ప్రారంభమవుతాయి. టీజర్లు, ఇటీవలి నివేదికలు ఈ రెండు పరికరాల దాదాపు అన్ని ఫీచర్లను వెల్లడించాయి. మరి రాబోయే వివో X300 FE, వివో X300 అల్ట్రాలలో ఉన్న ఫీచర్లు ఏమిటి/ వాటి అంచనా ధరలు ఏమిటో తెలుసుకుందాం.

వివో X300 FE ఫీచర్లు

మొదటి సిరీస్‌లోని కాంపాక్ట్ మోడల్ అయిన వివో X300 FE కొత్త ఆకుపచ్చ రంగు వేరియంట్‌లో వస్తుంది. ఇది ప్రత్యేకంగా భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ పరికరంలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉంటుందని టీజర్ కూడా ధృవీకరిస్తుంది. ఈ ఫోన్‌లో 6.31-అంగుళాల 1.5K LTPO ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ పరంగా, ఈ పరికరంలో 6,500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఈ పరికరంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లైలాక్ పర్పుల్, నోయిర్ బ్లాక్, అర్బన్ ఆలివ్ రంగులలో లభిస్తుంది.

వివో X300 అల్ట్రా ఫీచర్లు

ఈ సిరీస్‌లో అల్ట్రా మోడల్లో 6.82-అంగుళాల 2K LTPO ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ పరికరం 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 3,000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను చేరుకోగలదు. పనితీరు కోసం, ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను అమర్చారు. దీనికి 16GB వరకు ర్యామ్, 1TB స్టోరేజ్ జత చేయనున్నారు. ఫోటోగ్రఫీ కోసం, అల్ట్రా మోడల్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. అంతేకాకుండా, X300 FE, X300 అల్ట్రా రెండూ ఎక్స్‌టర్నల్ టెలిఫోటో ఎక్స్‌టెండర్ సపోర్ట్‌తో వస్తాయి. దీనిని వివో ఒక ప్రత్యేకమైన కెమెరా ఫీచర్‌గా ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్‌ 6600 mAh బ్యాటరీతో 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది.

వివో X300 అల్ట్రా, వివో X300 FE అంచనా ధరలు

నివేదికల ప్రకారం..వివో X300 అల్ట్రా సుమారుగా ర్.160,000 ధరతో విడుదల కావచ్చు. మరోవైపు, వివో X300 FE మాత్రం సుమారు రూ.80,000 నుండి ప్రారంభమవుతుందని అంచనా. విడుదలైన తర్వాత ఈ రెండు ఫోన్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వివో ఇ-స్టోర్‌తో సహా పలు ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.