
అసూస్ భారత మార్కెట్‌లో కొత్త అసూస్ అసూస్ ప్యాడ్ T3201 ట్యాబ్‌ను ఆగస్టు 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ట్యాబ్‌లో 2.8K OLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్, 9000mAh బ్యాటరీ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్లు అందించనుంది. కంపెనీ ఇప్పటికే ఈ ట్యాబ్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన ఫీచర్లను అధికారికంగా వెల్లడించింది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా?
ధర ఎంత ఉండొచ్చు?
అసూస్ ప్యాడ్ T3201 అధికారిక ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే మార్కెట్ అంచనాల ప్రకారం..ఈ ట్యాబ్ భారత మార్కెట్‌లో రూ.40,000 ధర పరిధిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి ధర, సేల్స్ వివరాలు ఆగస్టు 6న లాంచ్ ఈవెంట్‌లో వెల్లడికానున్నాయి.
ఫీచర్లు( అంచనా)
డిస్‌ప్లే: అసూస్ ప్యాడ్ T3201లో 12.2 అంగుళాల 2.8K రిజల్యూషన్ కలిగిన డ్యూయల్-లేయర్ OLED డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ స్క్రీన్ 3:2 ఆస్పెక్ట్ రేషియో, 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్తో వస్తుంది. దీంతో వీడియోలు, గేమింగ్, డిజిటల్ క్రియేటివ్ పనులకు అద్భుతమైన విజువల్ అనుభవం లభించనుంది.
పనితీరు: ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 SoC ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి 8GB LPDDR5X RAM, 256GB UFS 3.1 స్టోరేజ్ అందించనున్నారు. అదనంగా 1TB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం ఉంటుంది.
కెమెరా: ఫోటోగ్రఫీ కోసం 13MP రియర్ కెమెరా ఇచ్చారు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
బ్యాటరీ: ఈ ట్యాబ్‌లో 9000mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించనున్నారు. ఆడియో కోసం నాలుగు స్పీకర్ల సెటప్ ను అందించారు. ఇవి డాల్బీ అట్మాస్ 360-డిగ్రీ సినీమాటిక్ సౌండ్ కు మద్దతు ఇస్తాయి. ఈ ప్యాడ్ అసూస్ పెన్ 2.0తో పాటు దానికంటే ఉన్నతమైన స్టైలస్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. దీంతో నోట్స్ రాయడం, డ్రాయింగ్, డిజైన్ పనులు మరింత సులభంగా చేయవచ్చు.











