
ముంబై: త్వరలో జరిగే శ్రీలంక టెస్టు సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోందని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టుకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయన్నాడు. కొన్నేళ్లుగా వరుస ఓటములతో సతమతమవుతున్న భారత్ ఈ సిరీస్‌లో గెలిచి మళ్లీ గాడిలో పడడం ఖాయమన్నాడు. లంకతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా చాలా బలంగా ఉందన్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్‌లు మెరుగైన ప్రదర్శనతో జట్టుకు అండగా నిలువడం తథ్యమన్నాడు. బౌలింగ్‌లో కూడా జట్టు బాగానే ఉందన్నాడు. సిరాజ్, కుల్దీప్, జడేజాలతో బౌలింగ్ బలంగా కనిపిస్తుందన్నాడు. ఆకిబ్ నబి చేరికతో జట్టు బౌలింగ్ మరింత బలోపేతంగా తయారైందన్నాడు. సమష్టిగా రాణిస్తే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం టీమిండియాకు కష్టమేమీ కాదని జాఫర్ అభిప్రాయపడ్డాడు.











