న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కేం ద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో విస్తుపో యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిపుణులు, మధ్యవర్తులు ఒక వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి ఈ రాకెట్ నడిపినట్టు సీబీఐ గుర్తించింది. నీట్ పేపర్ లీకేజీకి మూడు సబ్జెక్టుల నిపుణులు పీవీ కులకర్ణి (కెమి స్ట్రీ), మనీషా సంజయ్ హవాల్దార్ (ఫిజిక్స్), మనీ షా గురునాథ్ మాందరే ప్రధాన కారకులని దర్యా ప్తు సంస్థ వెల్లడించింది. ప్రశ్నాపత్నం లీకేజీ నుంచి అభ్యర్థులకు సమాచారం చేరవేయడం వరకూ నిందితులు పక్కా క్రిమినల్ ప్లాన్ అమలుచేసినట్టు ఆధారాలతో సహా పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో 94 పేజీల ఛార్జ్‌షీట్‌ను సమర్పించింది.

చేతిరాత నోట్స్ స్వాధీనం

ఎన్‌టీఏ కేంద్రంలో ప్రశ్నల రూపకల్పన, అనువా దం చేస్తున్నప్పుడు వివిధ విభాగాల నిపుణులకు ప్రవేశం ఉండేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించిం ది. ఎన్‌టీఏలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ప్రవేశ, ని ష్క్రమణ మార్గాల్లో ఎలాంటి చెకింగ్‌లు ఉండేవి కా వని తెలిపింది. ఈ క్రమంలోనే నిందితులు కాగితాలపై ప్రశ్నలు రాసుకుని, పుస్తకాల్లో పేరాలను మా ర్క్ చేసుకునే వారిని పేర్కొంది. తమ నెట్‌వర్క్‌లో భాగమైన మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు ఆ ప్రశ్నలను చేరవేశారనే అభియోగాలు మోపింది. తమకు ఆర్థిక లబ్ధితో పాటు కో చింగ్ సెంటర్ల విజయ శాతాలను పెంచేందుకే ఈ కుట్ర పన్నారని తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన పీవీ కులకర్ణి కెమిస్ట్రీ ప్రశ్నపత్రంలోని 135 ప్రశ్నలను చిన్న చీటీలపై రాసుకుని రహస్యంగా బయటకు తీసుకెళ్లారని, ఎన్డీఏ వద్ద ఎలాంటి చెకింగ్‌లు ఉండేవి కాదని పేర్కొంది. మనీషా మదేరా తనరోజువారీ పని పూర్తి చేసుకుని హోటల్ రూమ్‌కు వచ్చిన తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో పేరాలను మార్క్ చేసుకునేదని వివరించింది.

ఫిజిక్స్ ట్రాన్స్‌లేషన్ బాధ్యత చూసుకునే మనీషా సంజయ్ హవాల్దార్ రోజువారీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఢిల్లీలోని తన బసకు వచ్చి సంబంధిత ప్రశ్నలను క్లుప్తంగా నోట్ చేసుకునే వారని వివరించింది. ఎన్‌టీఏ కార్యాలయంలో ఎలంటి సీసీటీవీ లైవ్ పీడ్ మానిటరింగ్ కంట్రోల్ రూమ్ లేనందున ఈ ముగ్గురు నిపుణుల చర్యలను గుర్తించేందుకు వీలులేకుండా పోయినట్టు తెలిపింది. అనంతరం తమ నెట్‌వర్క్‌లో భాగమైన మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు ఆ ప్రశ్నలను చేరవేశారనే అభియోగాలు మోపింది. ప్రశ్నపత్రాలను తేజాద్ హర్షకుమార్ షా, డాక్టర్ మనోజ్‌భగ్వాన్‌రావు షిరూరే, శివరాజ్ మోతేగావోంకర్, ధనంజయ్ నివృత్తి లోఖాండే, శివరాజ్ రాఘునాధ్ మోతేగావోంకర్‌లకు చేరవేశారని, వీరిలో కొందరు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు , కన్సల్టెన్సీలు నడుపుతున్నారని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌ో్ల పేర్కొంది. ఛార్జ్‌షీట్‌లోని వివరాల ప్రకారం, లీకైన పేపర్లను చేరవేయడంలో శుభం మధుకర్ ఖైర్నార్, మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్, రాజస్థాన్‌లోని వికాశ్ బివాల్, హర్యానాలోని యాష్ యాదవ్ కీలక పాత్రధారులని సీబీఐ పేర్కొంది.

యాష్ యాదవ్, ఖైర్నార్‌లు విద్యార్థుల నుంచి సెక్యూరిటీ ఒరిజినల్ సర్టిఫికెట్లు, సైన్ చేసిన ఖాళీ చెక్కులు వసూలు చేసేవారు. ఇందుకు సంబంధించి జైపూర్ హాస్టల్ గది నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు, సైన్ చేసిన చెక్కులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగీలాల్ బివాల్ మొబైల్ ఫోన్ నుంచి ఆడియో ఫైల్స్ సైతం స్వాధీనం చేసుకున్నారు. మనీష్ హవాల్దార్, తేజాస్ షా నుంచి కూడా లీకైన ప్రశ్నాపత్రాల సమాచారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నాసిక్ వద్ద వసతి ఏర్పాట్లు చేసి లీకైన పేపర్లను చదవించారని గుర్తించారు. ఆడియో రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్‌లు, సీడీఆర్ డేటాతో పక్కా ఆధారాలను సీబీఐ సేకరించింది. సీబీఐ ఛార్జ్‌షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయాన్ని రిజర్‌ో్వ్ల ఉంచింది.