
‘దేవతల పాత్రలు పోషించే అవకాశాలు నటీనటులకు అంత సులభంగా లభించవు. ఎందుకంటే అవి చరిత్రలో నిలిచిపోయతాయి. సీతమ్మ పాత్ర నాకు దక్కడం నా అదృష్టం’’ అని హీరోయిన్ సాయి పల్లవి అన్నారు. ఆమె సీతగా, రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్‌లో విడుదల కానుంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా శననివాం ఢిల్లీలో ప్రథమ్ సంకల్ప్ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘సీతమ్మ నేవ్వే నా ద్వారా ఈ పాత్రలో నటించూ అని ధ్యానం చేస్తుండేదాన్ని’ అని తెలిపారు.











