పొరుగుదేశం నేపాల్‌లో ఆకస్మిక వరదులు సంభవించి భారీ ప్రాణనష్టం, వందలాది మంది గల్లంతుకావడం, ఆస్తినష్టంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. నేపాల్ ప్రధాన మంత్రి బాలెన్ షోతో ప్రత్యేకంగా ఫోనులో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ ఆపత్కాలంలో నేపాల్ ప్రజలకు భారత ప్రభుత్వం అందగా నిలుస్తుందని తెలియజేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పనరావాసం, అత్యవసర వైద్య, ఆహార సాయం అందిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. సహాయక, రక్షణ చర్యలపై తమ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వరదలు ముచెత్తిన ప్రస్తుతం సంక్షోభ వేళ సాయం అందించేందుకు ముందుకు వచ్చిన ప్రధాని మోదీకి, భారత ప్రజలకు బాలెన్ షా ధన్యవాదాలు తెలియజేశారు.

టెబెట్ ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఉత్తర నేపాల్ సరహిద్దు ప్రాంతంలోని భోటెకోశీ నది ఉగ్రరూపం దాల్చి ఊళ్లను ముంచెత్తింది. ఈ విపత్తులో 400 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో 105 మంది భారతీయులు, మరో 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. ఈ విపత్తులో 16 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 41 మంది భద్రతా సిబ్బంది గల్లంతయ్యారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మెరుపు వరదలతో ప్రభావితమైన భారత జాతీయులకు సహాయం, సమాచారం కోసం ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు జారీ చేసింది. +977 985 131 6807, +977 970 910 7500 నెంబర్లను సంప్రదింటాలని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొంది. నేపాల్ టూరింజం హోర్టు సైతం ఇవే నెంబర్లు విడుదల చేసింది. వీటితో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1234, హాట్‌లైన్ 1144, టూరిస్ట్ పోలీస్ 9851289445ను సహాయం కోసం సంప్రందించాలని కోరింది.