అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టినట్లు సమాచారం. మృతుల్లో నిజామాబాద్ జిల్లా నవీపేట్ ప్రాంతానికి చెందిన రాహుల్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్య కోసం సుమారు మూడు నెలల క్రితం రాహుల్ అమెరికా వెళ్లారు. ఆయన ఇప్పటికే ఎంఎస్ పూర్తి చేసి, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో పీహెచ్‌డీలో చేరినట్లు తండ్రి హరిబాబు తెలిపారు.
పార్ట్‌టైమ్ ఉద్యోగానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద విషయం తెలియడంతో నిజామాబాద్‌లోని రాహుల్ కుటుంబంలో విషాదం నెలకొంది. బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, వాహనం వివరాలు, రోడ్డు పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది.









