హైదరాబాద్: తెలంగాణలో ఉపాధి అవకాశాలు, యువత ఆకాంక్షలు పెరుగుతుండటంతో సొంతింటి కొనుగోళ్లు పుంజుకుంటున్నాయని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 4.35 కోట్ల జనాభా, 1.14 కోట్ల కుటుంబాలు ఉండగా, దీనిలో 24.8% మంది యువత ఉన్నారు. 2021-2025 మధ్య హైదరాబాద్‌లో రూ.4.77 లక్షల కోట్ల విలువచేసే విక్రయాలు జరిగాయి.

పిఎంఎవైజి 2.0 కింద 11.56 లక్షల గ్రామీణ పేద కుటుంబాలు అర్హత సాధించాయి. కంపెనీ ఎపి, తెలంగాణల్లో 100కి పైగా శాఖలతో 13,000 మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. సంస్థ ఎండి, సిఇఒ రిషి ఆనంద్ మాట్లాడుతూ, నగర విస్తరణతో మధ్యతరగతి, తొలిసారి ఇళ్లు కొనేవారికి ఫైనాన్స్ అందించడమే సంస్థ లక్ష్యమని తెలిపారు.