వాట్సాప్ యూజర్లకు చేదు వార్త.. ఈ సెప్టెంబర్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిపివేయబడతాయని సమాచారం. అయితే అది అన్ని ఫోన్లకు కాదు. ఆండ్రాయిడ్ వెర్షన్ 5.0 లేదా అంతకంటే పాత వెర్షన్‌లో వాట్సప్ పని చేయదు. సెప్టెంబర్ 8 నుంచి ఆయా వెర్షన్లకు వాట్సప్ తన సపోర్ట్ నిలిపివేయనుంది. పాతతరం స్మార్ట్ ఫోన్లకు కొత్త తరహా ఫీచర్లను అందించడం కష్టతరమవుతున్న నేపథ్యంలో వాట్సప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వాబీటా ఇన్ఫో ప్రకారం.. సెప్టెంబర్ 8 నుంచి ఆండ్రాయిడ్ 6.0 లేదా ఆపై వెర్షన్లలో మాత్రమే వాట్సప్ అందుబాటులో ఉండదన్నమాట. ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే యూజర్లకు వాట్సప్ ఇప్పటికే అలర్ట్ నోటిఫికేషన్లు పంపిస్తోంది. అప్పటిలోగా చాట్ హిస్టరీని గూగుల్ డ్రైవ్‌లో లేదా ఇతర డివైజ్‌లో బ్యాకప్ చేసుకోవాలని సూచిస్తోంది. వాట్సప్ మెసెంజర్‌తో పాటు వాట్సప్ బిజిసెస్ కూడా నిలిచిపోనుంది. ఈ మార్పు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే. ఐఒఎస్ విషయానికొస్తే.. ఐఒఎస్ 15.1 లేదా ఆపై వెర్షన్‌లో వాట్సప్ యథావిధిగా పని చేస్తుంది.