న్యూఢిల్లీ : జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ తమ కొత్త రోడ్ స్టర్ రెడ్ వొల్ఫ్ బైక్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులోకి తెచ్చింది. 350 సిసి ఇంజన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, డ్యూయల్ ఛానల్ ఎబిఎస్, 12.5 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో 350 కిలోమీటర్ల పరిధిని ఇది ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2,09,950 గా ఉంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ రికార్డు

న్యూఢిల్లీ : మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యువి కేవలం 38 నెలల వ్యవధిలోనే 2 లక్షల ఎగుమతుల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంట్‌లో త యారైన ఈ వాహనం జపాన్‌తో సహా 90 దేశాలకు ఎగుమతి అవుతోంది. సంస్థ ఎండి హిసాషి టకేవుచి మాట్లాడుతూ, ఈ విజయం భారతీయ తయారీ రంగానికి గర్వకారణమని అన్నారు.