– తెలంగాణ రైతు సంఘం మహాసభలో తీర్మానంకొత్తగూడెం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధిఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం(సామినేని రామారావు నగర్-కాసాని అయిలయ్య ప్రాంగణం)లో జరుగుతున్న ఆ సంఘం రాష్ట్ర మూడో మహాసభలో గురువారం ఈ మేరకు తీర్మానించారు. రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రాష్ట్ర నాయకులు వెంకట్‌రెడ్డి బలపర్చారు. మహాసభ దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. […]
The post ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతు appeared first on Navatelangana.










