డార్విన్: తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఒక రోజు మిగిలి ఉండగానే ఆసీస్‌పై బంగ్లా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లా గెలుపులో హసన్ మహ్మూద్, మిరాజ్, తమీమ్, శాంటో కీలక పాత్ర పోషించారు. ఈ టెస్టు మ్యాచ్‌లో హసన్ మహ్మూద్ తొమ్మిది వికెట్లు తీసి ఆసీస్ బ్యాట్స్‌మెన్లను వణికించాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో తంజిడ్ హసన్ తమీమ్ సెంచరీతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో మెహిదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా బ్యాట్స్‌మెన్లు తంజిడ్ హసన్ తమీమ్(101), నజ్ముల్ హుస్సేన్ శాంటో (84), మెహిడీ హసన్ మిరాజ్(65), మోమినుల్ హక్(49), ముష్ఫికర్ రహీమ్(36) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో షాద్ మాన్ ఇస్లామ్(25), మహిమునుల్ హక్(30) పరుగులు చేశారు.  ఆసీస్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో విఫలం కావడంతో ఓటమిని చవిచూసింది. 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 198

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్:426

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 284

బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 57/1