
ఎక్సైజ్ శాఖ మంత్రి పేషీ, కమిషనర్ మధ్య తీవ్ర విభేదాలు
కానిస్టేబుళ్ల బదిలీల తరువాత మరింత ముదిరిన వివాదం
త్వరలో జరగబోయే బదిలీలపై పట్టుకు పేషీ అధికారుల ప్రయత్నాలు
కమిషనర్‌కు స్థానచలనం కలిగించేందుకు పావులు
‘మన తెలంగాణ’ వరుస కథనాల నేపథ్యంలో విచారణకు సిఎంఓ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ మంత్రి పేషీ వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ల (ఐఏఎస్)ల మధ్య అంతర్గతంగా వార్ నడుస్తోంది. ఎక్సైజ్ కమిషనర్‌గా హరికిరణ్ తీసుకునే నిర్ణయాలు పేషీ అధికారులకు మింగుడుపడడం లేదని తెలిసింది. 15 రోజుల క్రితం జరిగి న ఎక్సైజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో ఫోకల్ టు నాన్ ఫోకల్, నాన్‌ఫోకల్ టు ఫోకల్‌గా కానిస్టేబుళ్లను కమిషనర్ బది లీ చేయడంతో ఎక్సైజ్ శాఖ మంత్రి పేషీలో కొం దరికి ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. దీం తో కమిషనర్‌కు వ్యతిరేకంగా కొన్ని గ్రూపుల్లో ఆ యనకు వ్యతిరేకంగా మంత్రి పేషీలో పనిచేసే అ ధికారులు పోస్టులు పెట్టించినట్టుగా ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
త్వరలో జరుగను న్న ఎస్‌ఐ టు డిసి స్థాయి అధికారుల బదిలీల్లోనూ ఫోకల్ టు నాన్ ఫో కల్, నాన్‌ఫోకల్ టు ఫోకల్ విధానాన్ని అమలు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తుండగా, దానిని ఎక్సైజ్ శాఖ మంత్రి పేషీలో కొందరు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం కమిషనర్‌ను ఈ శాఖ నుంచి బదిలీ చేయించాలని కొందరు అధికారులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. కమిషనర్ ప్రస్తుతం అ వినీతి అధికారుల భరతం పడుతుండడంతో పా టు ఫోకల్ పోస్టుల్లో పాతుకుపోయిన వారిపై వే టు వేస్తున్నారు.
ఇవన్నీ మింగుడపడని కొందరు అధికారులు, సిబ్బంది మంత్రి పేషీలోని అధికారులతో చేతులు కలిపి కమిషనర్‌ను అక్కడి నుం చి తొలగించాలని తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. మెజార్టీ అధికారులు, సి బ్బంది మాత్రం కమిషనర్ కానిస్టేబుళ్ల బదిలీలు పారదర్శకంగా జరిగాయని త్వరలో జరిగే ఎస్ ఐ టు డిసి స్థాయి అధికారుల బదిలీలను సైతం ఇలాగే పారదర్శకంగా జరపాలని వారు విజ్ఞప్తి చేస్తుండడం విశేషం. అయితే, ఈ విషయం మిం గుడు పడని కొందరు అధికారులు ప్రభుత్వానికి కమిషనర్‌పై ఫిర్యాదు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అయితే, మంత్రి పేషీలో పనిచేసే కొందరు అధికారులు తమవారికి మంచి పోస్టింగ్ ఇప్పించాలని, తమ వారికి నిబంధనలు పెట్టవద్దని ఆ శాఖ ఉన్నతాధికారులకు సూచిస్తున్నట్టుగా తెలిసింది. అయితే, ఎస్‌ఐ టు డిప్యూటీ కమిషనర్ వరకు పదోన్నతులు ఇచ్చి రెండు నెలలు కావడంతో మంచి పోస్టింగ్ కోసం ఎస్‌ఐలు, సిఐలు, ఏఈఎస్‌లు, ఈఎస్‌లు, అసిస్టెంట్ కమిషనర్‌లు, డిప్యూటీ కమిషనర్‌లు మంత్రులు, ఎమ్మెల్యేల, ఐఏఎస్‌ల సిఫార్సు లేఖలను ఇప్పటికే తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. ఇలా సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటే బదిలీలు పారదర్శకంగా జరగవని, కానిస్టేబుళ్ల బదిలీల్లో అనుసరించిన విధానాలతోనే అందరికీ న్యాయం జరుగుతుందని నాన్ ఫోకల్‌లో పనిచేసే వారికి న్యాయం జరగదని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ విధానాన్ని అనుసరిస్తే తమ వారికి అన్యాయం జరుగుతుందని మంత్రి పేషీలోని అధికారులు కమిషనర్‌పై అబద్దపు ప్రచారాలను షేర్ చేస్తున్నారన్న గుసగుగసలు ఆ శాఖలో వినిపిస్తున్నాయి.
గ్రేటర్ పరిధిలోని డిసి పరిధి విభజన పూర్తి కాగానే..
అయితే, సిఎం రేవంత్‌రెడ్డికి కూడా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులు అందడంతో బదిలీలు పారదర్శకంగా జరగాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు సూచించినట్టుగా సమాచారం. ఇప్పటికే ‘మన తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన రెండు కథనాలు ‘ఎక్సైజ్ శాఖలో గంజాయి డాన్’లు, ‘ఆబ్కారీ శాఖలో అవినీతి కిక్కు’పై సిఎంఓ నుంచి విచారణకు ఆదేశించినట్టుగా సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన నివేదికను సిఎంఓకు ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదించనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు జీహెచ్‌ఎంసిని విభజించినట్టుగానే క్యూర్ పరిధిలోని (గ్రేటర్ పరిధిలోని) డిప్యూటీ కమిషనర్‌ల పరిధిని సైతం విభజించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రస్తుతం అదే పనిమీద ఉన్నట్టుగా తెలిసింది. వచ్చేనెల మొదటివారంలో ఈ విభజన పూర్తి కాగానే బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలిసింది.














