ఖరగ్‌పూర్: ఐఐటి ఖరగ్‌పూర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన పుల్లగురం దీపక్‌రెడ్డి(36) బుధవారం మధ్యాహ్న సమయంలో క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. సమాచారం అందుకున్న హిజ్లీ ఔట్ పోస్టు పోలీసులు వెంటనే క్యాంపస్‌లోని బిసి రాయ్ అసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన గదిని పోలీసులు సీల్ చేసి దర్యాప్తు చేపట్టారు.