హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచి వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైనప్పటికీ.. గత రెండు మ్యాచుల్లో విజయం సాధించి కెకెఆర్ తిరిగి పుంజుకుంది. ఇక సన్‌రైజర్స్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో కెకెఆర్ రెండు మార్పులు చేసింది. సీఫర్ట్ స్థానంలో ఫిన్ ఆలెన్, రమన్‌దీప్ సింగ్ స్థానంలో మనీశ్ పాండేని జట్టులోకి తీసుకుంది. సన్‌రైజర్స్ కూడా రెండు మార్పులు చేసింది. నితీశ్ స్థానంలో స్మరణ్, హర్ష్ దూబే స్థానంలో హర్షల్ పటేల్‌లు జట్టులోకి వచ్చారు.

తుది జట్లు:

కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), అంగ్‌క్రిస్ రఘువంశీ(కీపర్), కామరూన్ గ్రీన్, రొవ్‌మెన్ పోవెల్, మనీశ్ పాండే, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వైేభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, వరుణ్ చక్రవర్తి.

ఎస్ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్), హెన్రిచ్ క్లాసెస్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమ్మిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ.