
టీం ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐసిసి టి-20 ర్యాంకింగ్స్‌లో టాప్-50లోకి అడుగుపెట్టాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ అదరగొట్టాడు. మూడు వన్డేల్లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో తాజాగా ప్రకటించిన ఐసిసి టి-20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 230 స్థానాలను ఎగబాకి 536 రేటింగ్ పాయింట్లతో 48 స్థానానికి చేరుకున్నాడు.
ఇక తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో భారత క్రికెటరే ఉన్నాడు. 910 పాయింట్లతో ఇషాన్ కిషన్ నెం.1గా నిలిచాడు. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఫర్వాలేదు అనిపించిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే సిరీస్‌లో తేలిపోయాడు. దీంతో ఒక స్థానం కోల్పోయి 819 పాయింట్లతో మూడో ర్యాంకుకు పడిపోయాడు. పాకిస్థాన్ ఆటగాడు సహిబ్జాద ఫర్హాన్ (848) రెండో ర్యాంకుకు చేరాడు. తిలక్ వర్మ (750) రెండు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకులో నిలిచాడు. ఇక టి-20 బౌలింగ్‌లో టాప్-10లో కేవలం ఒక ఆటగాడు మాత్రమే ఉన్నాడు. 663 పాయింట్లతో మూడు స్థానాలు కోల్పోయి వరుణ్ చక్రవర్తి 9వ ర్యాంకులో స్థిరపడ్డాడు. బుమ్రా ఐదు స్థానాలను కోల్పోయి 17వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.











