ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అల్లరి నరేశ్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తన జానర్ వదిలేసి ఈ మధ్య సీరియస్ సినిమాలు కూడా చేశాడు. ఇప్పుడు మరో సూపర్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు నరేష్. ఆ సినిమానే ‘రంభ ఊర్వశీ మేనక’. చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురభి హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘నా కంటి మీద కునుకే’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. ధనుంజయ్ అలపించారు. ఈ సాంగ్‌ను చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హస్య మూవీస్ బ్యానర్‌లో రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.